31-12-2025 03:17:23 PM
హైదరాబాద్: నూతన సంవత్సరం బందోబస్తు(New Year Arrangements) ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే ఈవెంట్లకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి మందుబాబులకు షాకిచ్చారు. సమయం దాటి వేడుకలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాక్ డోర్ ద్వారా మద్యం విక్రయించడం పూర్తిగా నిషేధం అన్నారు. క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు రైడ్ నిరాకరిస్తే ఉపేక్షించబోమని సూచించారు. పోలీసులు అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు వెళ్లి నూతన సంవంత్సర వేడుకలు చేసుకోవాలని సీపీ ఆదేశించారు. డిసెంబర్ 31 చివరి రోజు కావడంతో మందుబాబులకు సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. మందు తాగి వాహనం నడిపితే తప్పించుకునే మార్గం లేదన్నారు. చక్ర వ్యూహంలో ఎగ్జిట్ ఇంటికి కాదు.. నేరుగా చంచల్‌గూడ జైలుకే(Chanchalguda Central Jail) అన్నారు. తాగి డ్రైవ్ చేయాలంటే మందుబాబులు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.