31-12-2025 04:13:02 PM
జైపూర్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనిఖీల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని టోంక్ నుండి 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను యూరియా సంచుల్లో ప్యాక్ చేసి కారుల తరలిస్తున్న లోడ్ ను పోలీసులు పట్టుకొని తనిఖీ చేశారు. అందులో 200 పేలుడు బ్యాటరీలు, 1100 మీటర్ల ఫ్యూజ్ వైర్లను ఉన్నట్లు గుర్తించి ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందని టోంక్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పేలుడు పదార్థాల స్వాధీనం దృష్ట్యా, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కఠినమైన నిఘా ఏర్పాటు చేశారు.