calender_icon.png 31 December, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా కొమ్మిడి రాజేందర్ రెడ్డి

31-12-2025 03:52:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల బిజెపి అనుబంధ సంఘాల కమిటీలను నియమాకం చేసినట్లు బిజెపి మండలాధ్యక్షుడు కందుల శ్రీనివాస్ తెలిపారు, బీజేవైఎం మండల అధ్యక్షునిగా రాముని పల్లి గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకులు కొమ్మిడి రాజేందర్ రెడ్డి నీ నియామకం చేయడం జరిగిందన్నారు.

అలాగే కిసాన్ మోర్చా మండల అధ్యక్షునిగా మెండే శంకరయ్య, ఓబిసి మోర్చా మండల అధ్యక్షునిగా వడ్లకొండ మహేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మి లను నియామకం చేసినట్లు కందుల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు, బిజెపి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆదేశాల మేరకు నియమకాలు చేపట్టడం జరిగింది అన్నారు.