31-12-2025 03:15:52 PM
శాంతియుతంగా జరుపుకుందాం: జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): నూతన సంవత్సరం ఆనందంగా మొదలవ్వాలి. నిర్లక్ష్యం వల్ల విషాధంగా మరకూడదు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు.
డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం ఉల్లంఘిస్తే కేసులు తప్పవు.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాల యజమానులపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు.జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్.2026 సంవత్సరంలో ప్రజలందరికి మంచి కలగాలని ఆశిస్తూ , జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.