calender_icon.png 21 June, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక

21-06-2025 12:33:20 AM

సమీక్షా సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): హైదరాబాద్ పరిసర ప్రాంతా లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రాథమిక సౌక ర్యాలను సమర్థవంతంగా అం దించడానికి ముందస్తు ప్రణాళిక రూపొందిం చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు సూచించారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీలో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో జనాభా, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. అనంతరం కొత్వాల్‌గూడలో ఎకోపార్కును సందర్శించారు.