ముగిసిన హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మణికొండ అదిరా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన జి ల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ -2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పురుషుల సింగిల్స్‌లో అభినవ కృష్ణ వి.డి, మహిళల సింగిల్స్‌లో బాల మాన్విత రెడ్డి అల్లం విజేతలుగా నిలిచారు.
వయో విభాగాల్లో శ్రీ లిఖి త్ జి.జి , శ్రేయా యాదవ్, అర్నవ్ ప్రకాశ్, చావకుల యశస్వి, శ్రీసాయి మణికంఠ కౌశి క్ గుత్తి, హంసిని మన్నె, కృష్ణ సుహాస్ మల్లిపెద్ది, అమృత రావు చేప్యాల, రోహన్ పబ్బి సెట్టి, బాల మాన్విత రెడ్డి అల్లం ఛాంపియన్లుగా నిలిచారు. సీనియర్ విభాగాల్లో శ్రీని వాస్ కుప్పనాడి, వినాయక్ ఎన్.ఎన్., కిషోర్ కుమార్ కె., నవీన్ పాతూరు, చిల్లుకూరి శ్రీనివాస్, రవి గోవింద్ రాచమళ్ల, నల్లమోతు రమేష్ విజేతలుగా నిలిచారు.
ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వర నా థ్, ప్రధాన స్పాన్సర్ ట్రూజోన్ సోలార్ సీఈఓ జక్కుల శ్రీనివాస్, హైదరాబాద్ బ్యా డ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కానూరి వంశీధర్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు సీ.బీ. తార ప్రసాంత్ చంద్ర, అది రా బ్యాడ్మింటన్ అకాడమీ యజమాని శిక్కా రం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.






