25 May, 2026 | 1:45 AM

స్మృతి మంధానపై స్పెషల్ సాంగ్

25-05-2026 12:52 AM

కాలికట్, మే 24: మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత మహిళా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్మృతి మంధానాకు ఈ నేపథ్యంలో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధా నకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కేరళకు చెందిన ప్రొఫెసర్ వశిష్ట్ ప్రత్యేక పాటను రాసారు.

కేరళ క్రికెట్ చరిత్రకారుడిగా పేరున్న వశిష్ట్ రాసిన ఈ పాటను ఆయన స్టూడెంట్ సిలు ఫాతిమా ఆలపించారు. స్మృతి క్రికెట్ ప్ర యాణాన్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్‌తో పాటు రెండు డబ్ల్యూపీఎల్ టైటిల్స్, ఆసియా క్రీడ ల్లో స్వర్ణం వంటి ఘనతల సాధించిన స్మృతి క్వీన్ ఆఫ్ ఇండియా క్రికెట్‌గా మారిందని ప్రొఫెసర్ వశిష్ట్ చెప్పారు.

రానున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ స్మృతి అద్భు తంగా రాణించి భారత్‌కు ట్రోఫీ అందించాలని ఆకాంక్షించారు. ప్రొఫెసర్ వశిష్ట్ గతంలో సచిన్ టెండూల్కర్, మారడోనా, లియోనల్ మెస్సీ వంటి క్రీడాదిగ్గజాలపై ప్రత్యేక పాటలు రాసారు. మలబార్ క్రిస్టియన్ కాలేజీలో సచిన్ టెండూల్కర్‌పై ఒక లైబ్రరీని సైతం ఏర్పాటు చేశారు. దీనిని సచిన్ గ్యాలరీగా పిలుస్తారు. దీనిలో సచిన్‌పై 11 భాషల్లో ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి. ఇటీవల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై ఆయన రచించిన పాటలు ఫిఫా మ్యాగ్‌జైన్‌లో సైతం ప్రచురించారు.