26 July, 2026 | 2:12 AM

హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయమే!

31-05-2024 01:20 AM

ఆ గుడిని దర్శించుకోకుండా కేటీఆర్‌ను అడ్డుకున్నదెవరు?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని కేటీఆర్ అంటున్నారు.. కానీ అది ఆయనకు మాత్ర మే వర్తిస్తుందని హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోకుండా కేటీఆర్‌ను ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

రాష్ట్రంలో ప్రజాపాలన నీటి మూటలేనని తెలిపారు. లోగోను మార్చడం, రాష్ట్ర గీతంలో మార్పులపై కనీసం ప్రజాభిప్రాయాన్ని తీసు కున్నారా అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలది ఒకే రకమైన వైఖరి అని విమర్శించారు. ధాన్యం సేకరణ, ఎరువుల సరఫరా, విత్తనాల లభ్యత, ఫోన్ ట్యాపింగ్ వంటి అనేక సమస్యలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.