26 July, 2026 | 3:08 AM

3 రోజుల పాటు వర్షాలు

31-05-2024 01:19 AM

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మళ్లీ అధిక ఉష్ణో గ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే, జూన్ 1 నుంచి 3 రోజులు పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా జూన్ 2, 3 తేదీల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. మరో వైపు నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాం తం మీదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాలు విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపిం ది.

కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాం తాలు, నైరుతి, మధ్య బంగళాఖాతం, పశ్చి మ బెంగాల్, సిక్కింలోని పాలు ప్రాంతాల్లో ఈ రానున్న మూడు రోజుల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గురువారం అత్యధికంగా 46.4 ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలోని మర్పల్లిలో 25.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టోలీచౌకిలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉస్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో గ్రేటర్ వాతావరణం పొడిగా ఉంటుందని, 39 నుంచి 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా 27 నుంచి 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వెల్లడించింది.