14 July, 2026 | 4:53 AM

రువాండా ర్యాలీలో హైదరాబాద్‌వాసి

14-07-2026 12:00 AM

నవీన్ పులిగిళ్లకు ఏఆర్‌సీ3 టైటిల్

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జూలై 10 నుంచి 12 వరకు రువాండాలోని బుగేసెరా జిల్లాలో జరిగిన ఫియా ఆఫ్రికన్ ర్యాలీ ఛాంపియన్షిప్ (ఏఆర్సీ) మూడో రౌం డ్ రువాండా మౌంటైన్ గొరిల్లా ర్యాలీలో హైదరాబాద్‌కు చెందిన టీమ్ డ్యూరాన్ రేసింగ్ డ్రైవర్ నవీన్ పులిగిళ్ల, కాసరగోడ్‌కు చెందిన కో-డ్రైవర్ మూసా షరీఫ్‌తో కలిసి ఏఆర్‌సీ3 కేటగిరీ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఎంఆర్‌యూ మోటార్‌స్పోర్ట్స్ ఆఫ్రి కాకు చెందిన ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ3 కారుతో పోటీపడిన భారతీయ జోడీ, మొత్తం 18 స్పె షల్ స్టేజ్లలో 12 స్టేజ్లలో విజయం సాధించి, నాలుగో స్థానంలో నిలిచింది. 

 ఈ విజయంతో నవీన్ పులిగిళ్ల, మూ సా షరీఫ్ జోడీ ఏఆర్‌సీ3 ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నవీన్ పులిగిళ్ల మాట్లాడుతూ అం తర్జాతీయ వేదిక పై ఏఆర్‌సీ3 టైటిల్ గెలవడం గర్వకారణమన్నారు. మూసా షరీఫ్ మాట్లాడుతూ మొ త్తం బృందం సమష్టి కృషికి ఈ విజ యం నిదర్శనమని తెలిపారు. 307.52 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ ర్యాలీలో కెన్యాకు చెందిన కరణ్ పటేల్ విజేతగా నిలిచారు.