14 July, 2026 | 4:52 AM

హైదరాబాద్‌లో సీసీఎస్‌ఐ సెం ట్రల్ ఈస్టర్న్

14-07-2026 12:00 AM

బేగంపేటలో ప్రారంభం

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): కంటామినేషన్ కంట్రోల్ సొసైటీ ఆఫ్ ఇండి యా (సీసీఎస్‌ఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ ఈస్టర్న్ చాప్టర్ (హైదరాబాద్ చాప్టర్)ను బేగంపేటలోని హోటల్ మనోహర్‌లో  ప్రారంభిం చా రు. సీసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు సర్ఫరాజ్ పంజ్వానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీసీఎస్‌ఐ జాతీయ కార్యదర్శి  సంత్ అద్వా నీ ‘ఎనర్జీ ఎఫిషియంట్ క్లీన్ రూమ్స్‘ అంశం పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

ఫా ర్మా, సెమీకండక్టర్, బయోటెక్, స్పేస్ రీసెర్చ్, ఈవీఎమ్ బ్యాటరీలు వంటి రంగాలకు క్లీన్రూమ్స్ ప్రాముఖ్యతను వివరించారు. సొసైటీ పరిశ్రమలు పరిశోధనల మధ్య వారధిగా పనిచేయడంతో పాటు, ఎంఎస్‌ఎం ఈల అభివృద్ధికి తోడ్పడటం, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎయిర్ కంటామినేషన్ కంట్రోల్‌ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. సీఆర్‌పీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు చెం దిన ఎంఎస్ ఆనంద్‌ను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చాప్టర్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సభ్యులుగా సచిన్ గోస్వామి, ఆసిఫ్ భాషా, స్వప్న, శ్రీకాం త్‌రెడ్డి, రామాంజనేయులు, సుబ్రమణ్యం, జ యవంత్, శ్రీధర్ ప్రమాణ స్వీకారం చే యగా, నిరూప నారాయణన్ అ డ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.