calender_icon.png 23 August, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలి: రంగనాథ్

23-08-2025 01:04:10 PM

హైదరాబాద్: హైడ్రా.. ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదని వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra commissioner Ranganath ) బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. సీఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, సాంకేతిక ఆధారాలతో చెరువుల ఎఫ్ టీఎల్ మార్క్ చేస్తున్నామని రంగనాథ్ వివరించారు.

చెరువుల వద్ద భూములు ధరలు కోట్లు పలుకుతున్నాయి.. చెరువులతోపాటు నాలాలను నోటిఫై చేస్తున్నామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కుల‌తో పాటు ర‌హ‌దారుల  ఆక్రమణలను గురువారం తొల‌గించింది.  22.20 ఎక‌రాల‌లో దాదాపు 100 ప్లాట్ల‌తో అనుమ‌తి పొందిన ఈ లే ఔట్‌లో 4 పార్కులుండ‌గా 2 క‌బ్జా(దాదాపు 8 వేల 500 గ‌జాలు)కు గుర‌య్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా క‌బ్జా అయ్యింది.  వీటికి తోడు.. దాదాపు 300ల గ‌జాల ప్ర‌భుత్వ స్థ‌లంలో అక్ర‌మంగా వెలిసిన హోట‌ల్ షెడ్డును కూడా హైడ్రా తొల‌గించింది. మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు రూ. 400ల కోట్ల వరకు ఉంటుందని హైడ్రా కమిషనర్ తెలిపారు.