23-08-2025 03:37:38 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): 11వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్(Telangana Junior Athletics Championships) మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడ పోటీలలో బెల్లంపల్లి కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించిన అండర్-14, అండర్-16, అండ్-18, అండర్-20 విభాగంలో బెల్లంపల్లి కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబరచారు. ప్రతిభ కనబరచిన క్రీడా కారులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ జోనల్ అకాడమిక్ మేనేజర్ నాగినేని సంపత్ రావు పాఠశాల డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపల్ యం. రాజా రమేష్లు క్రీడాకారులను మెడల్ తో సత్కరించి అభినందించారు.
విజేతలు...
అండర్-14 బాలికల విభాగంలో ఎన్. సహస్య (ఆరవ తరగతి) కిడ్స్ జావలిన్ లో బ్రాంచ్ మెడల్, త్రయత్లాన్ సి-గ్రూప్ లో కె. దీక్ష (8వ తరగతి) 60 మీటర్స్, లాంగ్ జంప్ మరియు 600 మీటర్స్ పరుగు పందెం లో బ్రాంచ్ మెడల్స్ ను సాధించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వి. మల్లేష్ యాదవ్, సల్పాల సంతోష్ యాదవ్, అధ్యాపక బృందం పాల్గొన్నది.