23-08-2025 03:40:23 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): శనివారం రోజున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం(Sundarayya Vignana Kendram)లో తెలంగాణ రాష్ట్ర భాష సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సహోదయ ఫౌండేషన్ సహకారంతో కోవిద ఆర్ట్ అండ్ కల్చర్ అకాడమీ తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన, జానపద జన జాతర కార్యక్రమానికి జనగామ జిల్లా ఓబుల్ కేశపురం వాసులు పగిడిపల్లి సుధాకర్, పంబాల కళాబృందం, పాల్గొని కళా ప్రదర్శన ప్రదర్శించడం జరిగింది. ఈ బృందాన్ని భాషా సంస్కృతిక శాఖ వారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుచన సుప్రీం, జాజాల గోవర్ధన్, కందుకూరి మనోహర్, జాజాల సామి ఇమ్మడి రాజశేఖర్, ఇమ్మడి ఎల్లేష్ కాటం ప్రసాద్, మరియు పగిడిపల్లి సురేందర్ పాల్గొన్నారు.