calender_icon.png 23 August, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతృత్వం చాటుకున్న సోమ శ్రీనివాస్

23-08-2025 03:52:10 PM

దోమల నివారణ కొరకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం.

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ నందు గ్రామసభ గ్రామస్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. గ్రామపంచాయతీలో నిధులు లేని కారణంగా వర్షాకాలం సీజన్లో దోమలను నివారించడానికి గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన సోమ శ్రీనివాస్ గొప్ప మనసు చాటుకొని గ్రామ పంచాయతీకి పదివేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. గ్రామస్తులు గ్రామ మాజీ సర్పంచ్ పెద్దబోయిన జనార్ధన్, గ్రామ పెద్దలు దాతకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమ్మయ్య, సోమచంద్రయ్య, మహమ్మద్ హుస్సేన్, స్వామి, రెడ్య, లింగయ్య తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.