23-08-2025 03:02:24 PM
అర్మూర్ (విజయక్రాంతి): ఎస్సారెస్పీ(SRSP) ప్రాజెక్టులోకి వరద నీరు ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద కొనసాగుతోంది. శనివారం 78 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 79 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇందులో వరద గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని, కాకతీయ కాల్వ ద్వారా 6500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లక్ష్మి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీరు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీరు చొప్పున వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు 80 టీఎంసీల సామర్థ్యం. శనివారం నాటికి 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉంటె ఈ నెల 18 నుంచి 22 వరకు అయిదు రోజుల్లో 46 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదలడం విశేషం.