23-08-2025 03:05:30 PM
పొలాల అమావాస్య సందర్బంగా ఆలయంలో ప్రత్యేకపూజలు
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో కాళికా మాత అమ్మవారిని శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(In-charge Velchala Rajender Rao) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వెలిచాల రాజేందర్ రావు, కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు చేశారు. రాజేందర్ రావుకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. కాళికా మాత అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. అదేవిధంగా కాళికా మాత అమ్మవారి అనుగ్రహం కరీంనగర్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలనీ, కరీంనగర్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా అమ్మ వారు చల్లగా చూడాలని రాజేందర్ రావు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, నేతి కుంట యాదయ్య, తాండ్ర శంకర్, కళ్లేపల్లి బాలరాజు, అనంతుల రమేష్ పటేల్, రొళ్ల సతీష్ పలువురు నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.