calender_icon.png 23 August, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు అభినందనలు

23-08-2025 03:20:13 PM

పీఆర్టీయూటీ ఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్..

పెద్దపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)కు పీఆర్టీయూటీ ఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్ అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఇండియాస్ టాప్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్ షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్-2025 జాబితాలో చోటు సంపాదించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి శాలువా, జ్ఞాపికతో సురేష్ సత్కరించారు. ప్రభుత్వం కోర్టు కేసులను సైతం అధిగమించి ఉపాధ్యాయుల ప్రమోషన్ ప్రక్రియ సజావుగా నిర్వహిస్తున్నందుకు సురేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల పలు పెండింగ్ సమస్యలను మంత్రి  దృష్టి కి తీసుకువెళ్లినట్లు కర్రు సురేష్ తెలియజేశారు.