19 May, 2026 | 11:37 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలు!

27-03-2026 12:40 AM

రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు

అమీన్‌పూర్, మార్చి 26 (విజయక్రాంతి): అమీన్‌పూర్ సర్వే నంబర్ 993, 823లో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయా సర్వే నంబర్లను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం జేసీబీలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

అక్రమ నిర్మాణాలపై ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్థానిక తహాశీల్దార్ వెంకటేశ్, ఆర్‌ఐ సంగీతలు తెలిపారు. ఈ సందర్భంగా తహాశీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమాలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యమన్నారు.  అక్రమ నిర్మాణాలపై హైడ్రా, రెవెన్యూ సంయుక్త చర్యలు చేపట్టాయని తెలిపారు.