5 July, 2026 | 12:51 AM

ఏకశిలానగర్‌లో హైడ్రా కూల్చివేతలు

24-06-2025 01:26 AM
  1. వెంచర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ నిర్మాణం
  2. స్థానికుల ఫిర్యాదులతో రంగంలోకి అధికారులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి)/ఘట్‌కేసర్: మేడ్చల్ గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశి లానగర్‌లో హైడ్రా అధికారులు సోమవా రం కూల్చివేతలు చేపట్టారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్‌లోని ప్లాట్లకు అడ్డుగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిర్మాణంపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా..  ప్రహరీ నిర్మాణం అక్రమంగా జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో సోమవారం ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రహరీని కూల్చివేశారు.