19-08-2025 12:00:00 AM
డాక్టర్ సంగని మల్లేశ్వర్ :
* నాడు దుడ్డు ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా ప్రభుత్వ పెద్దల అండదండలతో రహదారులకు అడ్డంగా కట్టుకున్న అనధికారిక నిర్మాణాలను చాలావరకు కూల్చేసింది మన హైడ్రా. నేడు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద కాలనీలోకి రా కుండా అన్ని మార్గాలను సుగమం చేసింది. హైడ్రా అంటే ఆక్రమణలు తొలగించడమే కాదు బాధ్యతగా పని చేస్తామని.. విమర్శించిన నోటి నుంచే ప్రశంసలు వచ్చేలా సిబ్బంది పని చేస్తుంది.
మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లు రాష్ర్టంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రళ యం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ (హైడ్రా) తన బాధ్యతలను గుర్తు చేసింది. గతేడాది ఆర్డినెన్స్‌తో ప్రత్యేక ఏజెన్సీగా హైడ్రాను ఏర్పాటు చేశారు.
విపక్షాల విమర్శలు, వివాదాలను ఎదుర్కొని ప్రభుత్వ స్థలాలు, నీటి వనరులను అక్రమార్కుల చెర నుంచి విముక్తి చేసింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచిన హైడ్రా రాజకీయ విమర్శలు ఎదుర్కొని, వివాదాల్లో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటూ వేల కోట్ల భూములను కాపాడింది. అన్యాక్రాంతమైన భూముల్లో ఆక్రమణలను గుర్తించి హైడ్రా నేలమట్టం చేసింది.
చెరువుల పునరుద్దరణతో పాటు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణల తొలగింపు ద్వారా వరద నీరు సాఫీగా వెళ్లడంతో విశ్వనగరం ముంపుకు గురి కాకుండా ఉందనే అభిప్రాయం ఏర్పడింది. ప్రజలు అవసరమ యితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు పంపిస్తోంది. ప్రధా నంగా హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎప్పటికప్పుడు ప్రజానీకానికి ఫోన్ల ద్వారా సమా చారం అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంది.
సామాజిక బాధ్యతతో ‘హైడ్రా’..
నాడు దుడ్డు ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా ప్రభుత్వ పెద్దల అండదండలతో రహదారులకు అడ్డంగా కట్టుకున్న అనధికారిక నిర్మాణాలను చాలావరకు కూల్చేసింది మన హైడ్రా. తద్వారా నేడు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద కాలనీలోకి రా కుండా అన్ని మార్గాలను సుగమం చేసిం ది. హైడ్రా అంటే ఆక్రమణలు తొలగించడమే కాదు సామాజిక బాధ్యతగా పని చేస్తామని.. విమర్శించిన నాయకులో నోటి నుంచే ప్రశంసలు వచ్చేలా సిబ్బంది పని చేస్తుంది.
ప్రభుత్వ అప్రమత్తంతో వరదనీటిలో చెల్లా చెదురు గాకుండా ఎలాంటి మరణమృదంగాలకు తావు ఇవ్వకుండా కట్టడి చేయకలుగుతుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు 20 సెంటీమీటర్ల వరకు నమోదైయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే మహానగరంలో జల ప్రళయానికి దారితీసే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో, నాలాల సమీపంలో నివసించే ప్రజలు ప్రమాదంలో చిక్కుకోకుండా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రేవంత్ ప్రభుత్వం తరలించేందుకు అంబులెన్స్‌లు, హెలికాఫ్టర్లు సిద్ధం చేసింది.
సెలవుల్లో ఉన్న అధికారులు సైతం విధుల్లో చేరి అప్రమత్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న ఉత్తరాఖండ్, నేడు జమ్మూ కాశ్మీర్ లో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగి, వందల సంఖ్యలో గల్లంతు అయినట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ లాంటి ఘటనలు తెలంగాణలో లేకపోవడం కాస్త ఊపిరినిచ్చే అంశం.
ముందు జాగ్రత్త చర్యలు..
భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద ఉదృతి పెరిగింది. భారీ వానలకు ఎగువ ప్రాంతాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగడంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారిపోయా యి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. సాగర్‌కు ఇరువైపులా ఉన్న బస్తీ వాసులను కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ముందస్తు అప్రమత్తం చేశారు.
హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లకు చేరింది. గత ఐదు రోజులుగా కురిసిన జడివానలకు హైదరాబాద్ సహా పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రోజుల వారీగా దంచి కొడుతున్న వానలతో అన్ని జిల్లాల్లోనూ భారీ వర్ష పాతం నమోదవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా సంగెం సహా నాగర్ కర్నూల్, కల్వకుర్తిలో అత్యధికంగా 20సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగారం, తిరుమలగిరిలో అతి భారీ 19సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. చెరువులు, కుంటలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వరంగల్ అర్బన్, ఖ మ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని లోత ట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు ఐఎండీ గుర్తించింది. దీని వల్ల ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యి. వ్యవసాయ భూముల్లో నీళ్లు నిలవడంతో పత్తి, మిర్చి, కంది, మొక్కజొన్న, కూరగాయల లాంటి పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది.
అపార నష్టం..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుం చి మూడు దఫాలుగా వర్షాల కారణంగా పంటలు నీట మునిగి, రైతులకు అపార నష్టం వాటిల్లిందనే అభిప్రాయం నెలకొం ది. ఇప్పటికే ప్రతి జిల్లాకు వరద సాయం కోసం కోటి రూపాయల నిధులు ప్రభు త్వం విడుదల చేసింది. వర్షాలు పూర్తిగా తగ్గితే కానీ, అన్నదాతలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయలేము. సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడూ సమీక్ష నిర్వహిస్తూ ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ప్రధానంగా విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల్లో అధికారులు, సిబ్బంది 24/7 అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం ఒక్కడుగు ముందుకేసి పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైడ్రా అంటే కూల్చివేతలకే పరిమితం కాకుండా నగరంలో వర్షాల వల్ల కలుగుతున్న విపత్తుల నిర్వహణను కూడా భుజానికెత్తుకుందంటూ ప్రజలు అభినందించడం ముదావహం.
వ్యాసకర్త సెల్: -9866255355