20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

10 కోట్ల విలువైన పార్క్ స్థలాన్ని రక్షించిన హైడ్రా

29-10-2025 07:47 PM

పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ, సర్వే నెంబర్ 93 నందు 20 గుంటల స్థలాన్ని పార్కుగా పేర్కొంటూ 2020లో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మున్సిపల్ అధికారులు పార్కును అభివృద్ధి చేయకపోవడం వల్ల కొందరు కబ్జాదారులు రెండు నెలల క్రితం ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. కాలనీ వాసులు, ఆకుల సతీష్ టీం పార్క్ కబ్జాను అడ్డుకోవడంతో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వుల మేరకు సీఐ నరేష్ ఆధ్వర్యంలో బుధవారం పార్క్ స్థలానికి ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ఈ సందర్భంగా పార్క్ స్థలాన్ని కాపాడినందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మున్సిపల్ కమిషనర్ నిధులు కేటాయించి, అభివృద్ధి చేసి ప్రజా వినియోగంలోకి తేవాలని కోరారు.