calender_icon.png 29 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్షిత ప్రాంతాలకు మార్లపాడు తండా ప్రజలు

29-10-2025 07:47:37 PM

కేశ్యతండకు ప్రమాదం లేదన్న ఎమ్మార్వో

అచ్చంపేట: మొంథా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండా, కేశ్యతండా గ్రామాలు నీటి జలతిక్ బంధంలో చిక్కుకున్న గ్రామాల సమీపంలోని చెరువుల కుంటలు తెగిపోవడంతో నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో ఆయా గ్రామాల్లోని గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పశువులు, ఇంట్లోని సామాగ్రి పూర్తిగా నీటిలో కొట్టుకుపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో సెల్ఫోన్లో స్విచ్ఛాఫ్ అయ్యాయి.

బయటి గ్రామాలకు వెళ్లేందుకు రహదారి మార్గం మూసుకో పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని గిరిజన ప్రజలు ఆహారం లేక అలమటించారు. విషయం తెలియడంతో తహసిల్దారు సైదులు, సిద్దాపూర్ ఎస్సై పవన్ కుమార్, మండల పరిషత్ అధికారులు మార్లపాడు తాండకు చేరుకుని గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేశ్యాతండాకు ఎలాంటి ప్రమాదం లేదని తహసిల్దార్ వెల్లడించారు. ముంపుకు గురైన మర్లపాడు తండా ప్రజలకు అవసరమైన ఆహారం ఇతర సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత వర్షం పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.