29-10-2025 07:52:11 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంకు చెందిన ఎస్.కె ఖాసీంకి అనారోగ్య కారణంతో ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి వైద్య ఖర్చులు భారమై బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అంజనాపురం గ్రామానికి చెందిన ఖాసీం మిత్రులు రూ.12000, సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సునీత రూ.6500 మొత్తం 18500 రూపాయలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులకి అందజేసి ఖాసీం ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో సహృదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు తుల్లుబెళ్ళ సునీత,సంపత్,తేజవత్ గాంధీ,బాణావత్ అశోక్ కుమార్, భూక్యా ఆనందరావు, భూక్యా హేంలాల్,బాణావత్ పంతులు,బోడా అశోక్,బోడా దిలీప్,తేజవత్ భాస్కరరావు ఉన్నారు.