calender_icon.png 6 May, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిపెద్ద పక్షిని నేనే!

20-04-2025 12:00:00 AM

ఈ పక్షి పేరు అండేయన్ కాండోర్. ఇది అమెరికాకు చెందిన పక్షిని. కొలంబియా, పెరు, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. పిల్లలు చూస్తే భయపడతారు. శరీరం అంతా నలుపు.. మెడపై భాగం, రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. చిన్న చిన్న పక్షులను ఆహారంగా తీసుకుంటుంది. కుందేళ్లను వేటాడి తింటుంది. ఇది కొన్ని రోజుల వరకు ఆహారం, నీళ్లు తాగకుండా ఉండగలదు.

కాని తిన్నప్పుడు మాత్రం.. అసలు నేల మీద నుంచి లేవలేనంతగా తింటుంది. అండేయన్ కాండోర్ బొలివియా, చిలీ, కొలంబియా దేశాలకు జాతీయ పక్షిని కూడా తెలుసా! మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో అతి పెద్ద పక్షి ఇదే. దీని గూడు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ పక్షి పుట్టిన ఆరు నెలల తర్వాతనే ఎగురుతున్నది. అప్పటి వరకు గూడులో ఉంటుంది. ఎక్కువగా పగటి పూట వేటాడటానికి ఇష్టపడుతుంది.

రోజుకు దాదాపు 200 కిలో మీటర్ల దూరం ఎగురగలదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కాని ఇది నిజం. ప్రస్తుతం ఈ పక్షి సంఖ్య సుమారుగా పదివేలు. బరువు దాదాపు 8 కిలోల వరకు ఉంటుంది. రెక్కల పొడవు 270 సెంటీ మీటర్లు ఉంటుంది. 50 ఏళ్ల వరకు జీవిస్తుంది. ఇది ఈ పక్షి విశేషాలు!