calender_icon.png 14 June, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాస్టింగ్ కౌచ్ గురించి నేనలా అనలేదు

14-06-2025 12:53:30 AM

ఫాతిమా సనా షేక్.. 2015లో వచ్చిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది. కానీ, ఆ సినిమాలో ఈ అమ్మడుకు పెద్దగా మార్కులు పడలేదు. తర్వాత బ్లాక్‌బస్టర్ ‘దంగల్’ చిత్రంలో నటించటంతో మంచి గుర్తింపు దక్కింది. ఇదిలా ఉండగా ఫాతిమా.. ఈ ఏడాది ఆరంభంలో ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిలో వర్క్ చేయడంపై స్పందిస్తూ అప్పుడు తనకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. సౌత్‌లో సినిమాలు చేస్తున్న రోజుల్లో ఒక క్యాస్టింగ్ ఏజెంట్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని చెప్పింది.

సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా? అని అడిగాడని.. అతని మాటల్లో ద్వంద్వార్థం మొదట తనకు అర్థం కాక పాత్ర కోసం ఎంతయినా కష్టపడతానని తాను చెప్పానంది. కానీ, అదే మాటను పదేపదే అడగటంతో అతని మాటల్లోని అర్థాన్ని గ్రహించానని తెలిపింది. ఇలాంటి సంఘటనే మరొకటి హైదరాబాద్‌లోనూ ఎదుర్కొన్నానని చెప్పింది. అక్కడ కొంత మంది నిర్మాతలు హీరోయిన్స్‌తో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటారని గత ఇంటర్వ్యూలో చెప్పింది ఫాతిమా.

అయితే, ఇటీవల మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కొందరు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం ఉంటుందని నేను చెప్పలేదు. ఆ పరిశ్రమలో నాకు ఎదురైన సంఘటల గురించే అప్పుడు నేను ప్రస్తావించా. అనవసర రాద్ధాం తం చేశారు. మహిళలకు ప్రతి పరిశ్రమలో ఇలాంటి సందర్భాలు ఎదరవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో తెలియడంలేదు. నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తి.. చిన్న స్థాయి క్యాస్టింగ్ ఏజెంటో.. నిర్మాతో అయి ఉండొచ్చు కదా! అంతే కానీ, ఆ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కాదు” అని స్పష్టతనిచ్చింది ఫాతిమా.