calender_icon.png 10 October, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు రొమాంటిక్ కథల్లో నటించడం ఇష్టం

10-10-2025 12:51:51 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఇందులో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లు. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియాఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి విలేకరులతో ఈ సినిమా విశేషాలను పంచుకుంది. 

* నాకు రొమాంటిక్ స్టొరీస్ చేయడం ఇష్టం. ‘తెలుసు కదా’లో ప్రేమ, భావోద్వేగాలు, నవ్వులు, పాటలు వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నీరజ చాలా సాఫ్ట్, సపోర్టివ్. చాలా పాషన్‌తో సినిమా చేశారు. ఆమె విజ న్ ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. 

* నేను తొలిసారి నటిస్తున్న ప్రేమకథా చిత్రమిది. -చాలా హ్యాపీగా ఉంది. ‘కేజీఎఫ్’, ‘హిట్3’ వంటి రక్తపాతం పారే సినిమాల తర్వాత ఈ లైట్ హార్టెడ్ మూవీ చాలా కొత్తగా ట్రై చేశాం. -ఇద్దరమ్మాయిలు, అబ్బాయి అంటే ముక్కోణ ప్రేమకథ అనుకుంటారు. కానీ, ఇందులో ఒక యూనిక్ పాయింట్‌ను టచ్ చేశాం. అదేంటో సినిమాలోనే చూడాలి. అది చూసినప్పుడు కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. 

* ఈ సినిమాలో నేను రాగ పాత్ర లో కనిపిస్తాను. వ్యక్తిగతంగా నా జీవితానికి.. రాగ పాత్రకు -కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే ఈ క్యారెక్టర్‌లో కొంత గ్రే షేడ్ ఉంది. పర్సనల్‌గా నేను అలా ఉండలేను.

* వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమాలో నేను ఉన్నానో లేదో -నిజంగా నాకు తెలీదు. ఆ సినిమా అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది నిర్మాతలే చెబుతారు. 

* సిద్దుకు సినిమాకు సంబంధించి అన్నీ విభాగాల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒక యాక్టర్‌కు అన్ని డిపార్ట్‌మెంట్లపై పట్టు ఉండటం అదృష్టం. తన టైమింగ్ అద్భుతం. -రాశి ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. తన డైట్, వర్క్ అవుట్ అన్నీ పద్ధతిగా ఉంటాయి. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా విషయాలు నేర్చుకున్నా.