10-10-2025 12:48:50 AM
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న పాన్‌ఇండియా చిత్రం ‘వృషభ’. నంద కిషోర్ దీన్ని హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూ ర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మాతలు. ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా విడుదల తేదీని టీమ్ అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. సమర్జిత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిన్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీక రించబడిన ఈ సినిమా ను హిందీ, కన్నడ భాషల్లో నూ రిలీజ్ చేయనున్నారు.