15-06-2025 01:14:46 AM
అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషిస్తున్న కాన్సెప్ట్- సెంట్రిక్ చిత్రం ‘8 వసంతాలు’. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవికుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న విడుదల విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక అనంతిక విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై సినిమా విశేషాలను పంచుకున్నారు.
కథంతా మీ చుట్టూనే తిరుగుతున్నట్టుంది..?!
-ఇది మహిళల కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమాన ప్రాముఖ్యత ఉంది. ప్రతి పాత్ర ముఖ్యమే.
‘మ్యాడ్’ తర్వాత ఈ సినిమానే ఎందుకు..?
-మంచి కథ కోసం ఎదురుచూశాను. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్‌స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ ఈ కథలోనే కుదిరాయి. ఫర్ఫార్మెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. కథ చదివినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. లిటరల్‌గా ఏడ్చేశాను. అంత ఎమోషనల్‌గా చెప్తున్న కథ ఇది. నేను ఇందులో శుద్ధి అయోధ్య పాత్రలో కనిపిస్తాను. తను ఒక రచయిత. అలాగే తనకు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది.
ఈ ప్రేమకథలో ప్రత్యేకత ఏమిటి?
చాలా స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. నిజంగా ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని వయసుల వారికీ రిలేట్ అవుతుంది.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
-నాకు బ్లాక్‌బెల్ట్ వచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కోసం కళరి ఫైట్‌తోపాటు వింగ్‌చున్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్‌ను కూడా నేర్చుకున్నా. దానికోసం మూడు నెలలపాటు అంజి మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు.
నటీనటులు.. డైరెక్టర్ గురించి..
హనురెడ్డి చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. రవి ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు. ఫణీంద్ర నాకు గురువు లాంటి వారు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నా. ఆయన క్లియర్ విజన్‌తో ఉంటారు. చాలా పాషనేట్ ఫిలిం మేకర్. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.
శుద్ధి అయోధ్య చాలా ఎమోషనల్ క్యారెక్టర్ కదా.. షూట్ తర్వాత ఎలా అనిపించింది?
-ఇంటికి వచ్చిన తర్వాత అద్దం చూసుకుంటే చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్, బిహేవియర్ అవన్నీ నాకు గుర్తుచ్చేవి. వెరీ మెమరబుల్ క్యారెక్టర్.
మ్యూజిక్ గురించి..
-హేషమ్ రెండు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెండు పాటలు ప్రేక్షకులకు చాలా నచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది.
యాక్టర్ కాకపోయినా ఇంకేం అయ్యేవారు?
-పొలిటీషియన్ అవ్వాలని నా కోరిక. అయితే అది ఇప్పుడే కాదు.. నాకు 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత (నవ్వుతూ). నేనిప్పుడు లా చదువుతున్నది కూడా అందుకోసమే.
డ్రీమ్ రోల్స్.. రాబోయే సినిమాలు..!
పవర్‌ఫుల్ అండ్ స్ట్రాంగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. చాలా కథలు విన్నాను. కానీ ఏ సినిమా అయినా ఈ ‘8 వసంతాలు’ ఫలితం తర్వాతే ఓకే చేయాలనుకుంటున్నాను.