05-01-2026 12:41:34 AM
ఘనంగా లూయి బ్రెయిన్ జన్మదిన వేడుకలు
మలక్‌పేట్, జనవరి 4 (విజయక్రాంతి): లూయీ బ్రెయిల్ కనుగొన్న ఆరు చుక్కల లిపితో అందుల జీవితంలో వెలుగులు నింపారని రాష్ట్ర దివ్యంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ అన్నా రు. సర్ లూయి బ్రెయిలీ 217 వ జయంతిని పురస్కరించుకుని మలక్పేట్ నల్గొండ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆయన అన్నారు.
టెన్త్ వరకు ఉన్న అంధుల పాఠశాలను అప్‌గ్రేడ్ చేస్తూ ఇంటర్, డిగ్రీ కళాశాలను త్వర లోనే ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారు. అనంతరం వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధం గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలను వెచ్చించిందని పేర్కొన్నారు.
లూయి బ్రెయిలీ లిపిని గ్యాంగులకు పరిమితం చేయకుండా సకలాంగ విద్యార్థుల కూడా అవగా హన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, సంచాలకురాలు శైలజ, జిఎం ప్రభంజన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అన్నలా తోడుంటా
సికింద్రాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): దివ్యాంగులకు అన్నలతోడు ఉంటానని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అందులకు మా త్రమే కాదు, సమాజానికే వెలుగు చూపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధ విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాంజెం డర్ల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజత తదితరులు పాల్గొన్నారు..