05-01-2026 12:42:51 AM
తరిగొప్పుల, జనవరి 4 (విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ పరిధిలో గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఊర గుట్ట కింద త్రాగునీరు కోసం పైపులైను పనులు ఆదివారం రోజున సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పరశురాములు, ఖాత సందీప్, విజయలక్ష్మి, వార్డ్ నెంబర్ పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.