05-01-2026 12:40:51 AM
ఆయా వార్డుల్లో పల్లెటూరి ఓటర్ల పేరు ప్రత్యక్షం
వేరే నియోజకవర్గాల్లో ఓటర్ల పేరు మరొక నియోజకవర్గంలో
వార్డుల విభజన ఓటర్లలో గందరగోళం
తలలు పట్టుకుంటున్న ఔత్సాహికలు
నిర్మల్, జనవరి 4 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం. ఎన్ని కలు ఏవైనా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ తీర్పు శిరసా వహించవలసింది. ఓటు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారుల నిర్లక్ష్యం నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందు కు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలో వార్డులు వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు.
నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీ ఉండగా మూడు మున్సి పాలిటీలో ప్రభుత్వ అధికారులు విడుదల చేసిన ఓటర్లు జాబితాలో వార్డులు విభజన ఓటర్లలో గందరగోళం ఏర్పడడంతో ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ల జాబితాలు చూసి తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ రిజర్వేషన్ల మాట ఎలా ఉన్నాయ్.. అసలు ఓటర్లు జాబి తా తన రాజకీయ పదవికి పెసరుపెట్టేలా ఉం దని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీ నేతలు కార్యాలయాల్లో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
అన్ని మున్సిపాలిటీలో గందరగోళం
నిర్మల్ జిల్లాలో మొత్తం 1,67.100 ఓటర్లు ఉన్నారు. ఇందులో నిర్మల్ జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా 98, 295ఓటర్లు ఉండగా అందులో 50, 878 మహిళా ఓటర్లు 47,399 పురుష ఓటర్లు ఉన్నారు. భైంసాలో 26 వార్డులు ఉండగా 51, 118 మొత్తం ఓటర్లు ఉండగా 25, 623 ఓటర్లు 25,486 పురుష ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 17,693 ఓటర్లు ఉండగా 9,169 స్త్రీలు 8, 524 పురుష ఓటర్లు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీలో వాడుల విభజన ఓటర్ల లిస్టులో పేర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. ఆ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లను ఆయా వార్డుల్లో సమానంగా సర్దుబాటు చేయవలసి ఉండగా కొన్ని వార్డులో పరిమితికి మించి ఓటర్ల ఉన్న ట్టు లెక్కల్లో వెల్లడించారు.
కొన్ని వార్డుల్లో తక్కువ ఓటర్లు సూచించారు. మూడు మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో వార్డులు విభజన ఓటర్లలో పారదర్శకత లేదు. దీనికి తోడు విభజించినవాడు ఓటర్ల జాబితాలో ఆ వార్డులో లేని ఓటర్లను ఇతర వాడు నుంచి తీసుకొచ్చి చేర్చి చూపించారు. ఓటర్లను వేరే వార్డులో చూపించారు. దీనికి తోడు నిర్మల్ మున్సిపాలిటీలో నిజామాబాద్,బోథ్, ఆర్మూర్, నర్సాపూర్, సదిల్వార్పూర్ లక్ష్మణ చందా మండల ఓటర్ల పేర్లు దర్శనమిస్తున్నాయి.
ఖానాపూర్‌లో చుట్టుపక్కల గ్రామపంచాయతీలో ఓటర్లను చేర్చారు. బైంసా మున్సిపల్‌లో కూడా కుంటాల,కల్లూరు,లోకేశ్వరం, ముథోల్, బాసర ఓటర్ల పేర్లు ఉన్నట్టు జాబితాను పరిశీలించిన పరిశీలకులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తమ వార్డులో పరిధిలో ఉన్న ఓటర్లను వార్డుల్లో చేర్చడం వల్ల తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లు తమకు ఓట్లు వేసే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు.
కొన్ని ఓటర్ల పేర్లతో పక్క వార్డుతో సంబంధం లేకుండా ఎక్కడో దూరం గా ఉన్న ఓటర్ జాబితాలో మార్పిడి చేశారు. అలాగే మరణించిన ఓటర్లను ఓటరు జాబితాలో దర్శనమిస్తున్నాయని ఖానాపూర్ మున్సిపాలిటీ మున్సిపల్ ఓటర్లను నిర్మల్ మున్సిపాలిటీలో కొన్ని వార్డులో పేర్లు ఉన్నట్టు పోటీ చేబోతున్న అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలో ఓటర్ జాబితాను ప్రకటించిన అధికారులు ఈనెల 5 వరకు ఓటర్ జాబితాపై పేర్లు మార్పి డి అభ్యంతరల స్వీకరణ చేపట్టి వచ్చిన ఫిర్యాదుల అనంతరం ఈనెల 10న తుది జాబితా ప్రకటించేందుకు చర్యలు చేపడుతున్నారు.
వేల సంఖ్యలో ఫిర్యాదులు
నిర్మల్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలో అధికారులు ప్రకటించిన ఓటర్ జాబితాలో తప్పుల తడకగా ఉండడంతో వాటిని సరి చేసేందుకు నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తు న్నాయి. ఈ ఫిర్యాదులను వార్డు అభివృద్ధి అధికారులకు సమర్పించుకుంటున్నారు. అరులైన పేర్లను తమ వార్డులో చేర్చి లేని ఓటర్లను ఆ జాబితా నుండి తొలగించాలని ఫిర్యాదు చేస్తున్నారు. నిర్మల్‌లో వెయ్యికి పైగా ఫిర్యాదులుగా, ఖానాపూర్, బైంసా మున్సిపల్‌లో వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు ఐదవ తేదీ తర్వాత బిఎల్వోల సమక్షంలో విచారణ జరిపి మార్పులు చేర్పులు చేస్తామని చెప్తున్న ఇది పకడ్బందీ ఓటర్ల జాబితా రూపకల్పనకు సాధ్యం కాకపోవచ్చని రాజకీయ పార్టీల నేతలే పేర్కొంటున్నారు.
కోర్టు మెట్లు ఎక్కేందుకు నేతలు సిద్ధం
నిర్మల్ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలో విడుదల చేసిన ఓటర్లు జాబితా గందరగోళంగా ఉండడం వేరే నియోజకవర్గ ఓటర్ల పేర్లు మరో నియోజకవర్గాల మున్సిపాలిటీలో పేర్ల జాబితాలో ఉండడం వార్డుల విభజన ఓటర్లు హెచ్చుతగ్గులు ఉండడం గమనించిన రాజకీ య పార్టీల నేతలు మార్పు చేర్పులకు దరఖా స్తు ఇచ్చిన సమస్య పరిష్కారం కాకపోతే కోర్టు కు వెళ్తామని ప్రకటిస్తున్నారు. 10 తర్వాత తుది జాబితా అనంతరం న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు తగిన ఆధారాలను సిద్ధం చేసుకుంటున్నారు.
మా వార్డులో నిజామాబాద్ జిల్లా ఓటర్లు ఉన్నారు
నిర్మల్ మున్సిపాలిటీలోని మైనార్టీలు అధికంగా ఉండే వార్డుల్లో ఇతర జిల్లాల్లోని హిందువుల ఓటర్ల పేర్లు ఉన్నా యి. వార్డుల్లో నిజా మాబాద్, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని గ్రామీణ ఓటర్ల పేర్లు స్పష్టంగా జాబి తాలో ఉన్నాయి. వారు ఎవరో తెలియదు. ఓటు ప్రాధాన్యత నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితా తప్పులు వారి రాజకీయ భవిష్యత్తుకు వేస్తున్నాయి. తన ఒక వార్డులోనే 100 ఓటర్ల తప్పుల పేర్లు ఉండడంతో వేరువేరుగా ఫిర్యాదు చేసిన.
రిజ్వాన్ ఖాన్, మైనార్టీ నాయకులు
న్యాయం జరగకపోతే కోర్టుకు..
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో అధికారులు ప్రకటించిన ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉంది వార్డుతో సంబంధం లేని ఓటర్లను వార్డుల్లో చూపించారు. పట్టణ ఓటర్లలో జాబితాలో వేరే నియోజకవర్గంలోని పల్లెటూ రి ఓటర్ల పేర్లను ఇతర జిల్లాల ఓటర్ల పేర్లను జాబితాలో ఉండడం వల్ల పోటీ చేసే ప్రజాప్రతినిధులు గందరగోళం చెందుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి న్యాయం చేయకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం.
మార్గొండ రాము,
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు
ఫిర్యాదులు చేస్తున్నాం..
నిర్మల్ మున్సిపల్‌లోని ఆయా వార్డులో ఓటర్ జాబితాలో తప్పుల పై ఇప్పటికి అన్ని వార్డుల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. వార్డులో స్థానికంగా లేని వారి పేర్లు ఇతర గ్రామాల ఓటర్లు ఉన్నారు.. వారు మా ఎన్నికల్లో ఎట్లా ఓట్లు వేస్తారు. అధికారులు వెంటనే ప్రతి ఫిర్యాదుని విచారణ జరిపి ఆయా వార్డుల్లో సర్వే చేసి సమగ్ర ఓటర్ల జాబి తా రూపొందించి ఎన్నికలకు వెళితే బాగుంటుంది.
కొండాజి శ్రావణ్,
బిజెపి యూత్ నాయకులు