calender_icon.png 6 May, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటా..

06-05-2025 12:00:00 AM

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, మే 5 (విజయక్రాంతి): సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన వయో వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన అంశాల గోడ పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సేవలను గుర్తించి గత కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాతో మాట్లాడి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న శిథిలావస్థకు చేరిన ఒక గదిని మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించానన్నారు.

జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ కేసులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సత్వరం పరిష్కరిస్తున్న  జగిత్యాల  ఆర్డీవో మధుసూదన్ ను, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తదితర సంఘ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ రాష్ర్ట కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి, నాయకులు దిండిగాల విఠల్, వెల్ముల ప్రభాకర్ రావు, ఎం.డి.యాకూబ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ, మాజీ కౌన్సిలర్లు పంబాల రాంకుమార్,  క్యాదాసు నవీన్, కూసరి అనిల్ కుమార్, బద్దం జగన్ తదితరులు పాల్గొన్నారు.