06-05-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, మే 5 (విజయక్రాంతి) : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివా రణపై నగరపాలక సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ బృంధం వివిధ వ్యాపార షాపు ల పై దాడులు చేసింది. కరీంనగర్ నగరంలో సోమవారం కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ను నివారించేందుకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి ఆద్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోని టవర్ సర్కిల్ లో పలు వ్యాపార దుకాణాలపై చేశారు. 6 షాపులలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లభ్యం కావడంతో దాదాపు 100 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేస్తున్నారు. కార్యక్రమంలో సానిటేషన్ ఎస్సులు వెంకన్న, శ్రీనివాస్, నర్వోత్తమ్, శ్రీధర్ పాల్గొన్నారు.