calender_icon.png 13 November, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

349 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

13-11-2025 12:47:40 AM

తూప్రాన్, నవంబర్ 12 :సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుండి మహారాష్ట్రలోని నాందే డ్ కు 349 క్వింటాళ్ల ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా తరలించే క్రమంలో టాస్క్ఫోర్స్ అధికా రులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ డీఎస్పీ రమే శ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నరసింహులు, అజయ్, సాయికుమార్ లు నమ్మదగిన సమాచారం మేరకు వాహనాన్ని వెంబడించి తూప్రాన్ లోని బైపాస్ లో పట్టుకొని సీజ్ చేయడం జరిగింది.

పట్టుకున్న వాహనాన్ని తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచారు. అనంతరం తూప్రాన్ లోని పౌర సరఫరాల గోదాములలో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని భద్రం చేయడం జరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. వాహనాన్ని తరలించే డ్రైవర్, క్లీనర్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నారు.