పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
22-08-2026 12:53 AM
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జిన్నారం, ఆగష్టు 21 : జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ముదిరాజ్, జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు రాజేష్, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, బ్రహ్మేందర్ గౌడ్, యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






