7 April, 2026 | 2:47 AM

అంగన్వాడీల్లో సౌకర్యాలు మెరుగుపడటానికి కృషి చేస్తా

07-04-2026 01:02 AM

కార్పొరేటర్ కొత్వాల విమలా దేవి

పాల్వంచ, ఏప్రిల్ 6, (విజయక్రాంతి): అంగన్వాడిలలో సౌకర్యాలు మెరుగుపడటానికి కృషి చేస్తానని పాత పాల్వంచ 46 వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి అన్నారు. సోమవారం పాత పాల్వంచ 46 వ డివిజన్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. బడికి సంసిద్దత కార్యక్రమం చేపట్టి, పిల్లలతో, తల్లితండ్రులతో మాట్లాడారు. పిల్లల ఎత్తు, బరువు తూకాలను చూసారు.

బాలామృతం, కోడి గుడ్డు, పల్లీ చిక్కీస్ పంపిణీ చేశారు. కేంద్రం నిర్వహణ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విమలా దేవి మాట్లాడుతూ అంగన్వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నిర్వాహకులు జి. పద్మ, పి. నాగమణి, పి. రాజ్యలక్ష్మి, ఆర్. పి యాటా అరుణ, వార్డు ఆఫీసర్ దామెర్ల నరేష్  తదితరులు పాల్గొన్నారు.