7 April, 2026 | 2:51 AM

జెకె-5 ఓసీ నిర్వాసితుల సమస్యపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు

07-04-2026 01:03 AM

ఇల్లందు టౌన్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఇల్లందు మండల పరిధిలోని జెకె-5 ఓసీ కొనసాగింపులో నిర్వాసితులను నోటీసులు లేకుండా ఖాళీ చేయాలని సింగరేణి ఒత్తిడి తెస్తోందని విజయలక్ష్మి నగర్, తిలక్ నగర్ సర్పంచులు చాందవత్ రమేష్ బాబు, ధనసరి స్రవంతి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గ్రీన్ వెన్స్డేలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ను కలిసి పిర్యాదు చేశారు. నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస సదుపాయాలు కల్పించిన తర్వాతే ఖాళీ చేస్తామని స్పష్టం చేయగా పూర్తి వివరాలు సమర్పించాలని జేసీ సూచించారు.