ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వితే కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 (విజయ క్రాంతి): ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతరెడ్డి హెచ్చరిక- ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ యం. మ హేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీతరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు, రెవెన్యూ భూ ముల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ని ఘా కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీ తారాంపేట్ గ్రామ రెవెన్యూలో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక ఇటాచి వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రైమ్ నంబర్ 588/2026 కింద U/S 303(2), 329(3) సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మట్టి తవ్వడం, తరలించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలు, మట్టి రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం అందినా వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.






