calender_icon.png 16 December, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్లమల్యాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

16-12-2025 02:11:55 AM

గట్లమల్యాల సర్పంచ్ ఇంగే నరేష్

నంగునూరు, డిసెంబర్ 15:స్థానిక ఎన్నికల్లో గట్లమల్యాల గ్రామం నుంచి గెలుపొందిన ఇంగే నరేష్ గ్రామ ప్రజలందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి, నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.

తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ,అలాగే ఎన్నికల ప్రక్రియలో సహకరించిన ప్రతి పౌరుడికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకమే నా బలం, ఈ విజయానికి మీరు అం దించిన సహకారం మరువలేనిది,‘ అని పేర్కొన్నారు.

గట్లమల్యాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తానని,గ్రామ ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు.మీ అందరి తోడ్పాటుతో గట్లమల్యాలను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ గ్రామంగా మారుద్దాం,‘ అని నరేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.