16-12-2025 02:13:02 AM
వెంకిర్యాల పంచాయతీ ఎన్నికల్లో రికార్డు
మహబూబాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కోసారి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. జనగామ జిల్లా వెంకిర్యాల పంచాయతీ ఎన్నికల్లో కుమార్తె సర్పంచ్ గా ఎన్నికవ్వగా, తండ్రి ఉపసర్పంచ్ గా ఎన్నికైన ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికవ్వగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన వార్డు సభ్యులు సమానంగా గెలవడంతో ఉప సర్పంచ్ పదవికి పోటీ చేసిన వారి గెలుపు కోసం సర్పంచ్ ఓటు అనివార్యమైంది. దీంతో వార్డు సభ్యుడిగా ఎన్నికైన అలేఖ్య తండ్రి పర్షయ్యకు సర్పంచ్ గా ఎన్నికైన కూతురు అలేఖ్య మద్దతు పలకడంతో ఉపసర్పంచ్ గా ఎన్నికయ్యారు. గ్రామానికి కూతురు, తండ్రి సర్పంచ్ ఉప సర్పంచ్ గా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు.