calender_icon.png 9 December, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

09-12-2025 12:54:37 AM

సంగారెడ్డి జిల్లా పీపాడ్‌పల్లిలో ఘటన

సంగారెడ్డి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నమ్మిన నేతలే దూరం పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురై సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపాడ్‌పల్లిలో జరిగింది. పీపాడ్‌పల్లి గ్రామానికి చెందిన చాల్కి రాజు(35) కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఈ స్థానాన్ని మరో వ్యక్తి సైతం ఆశించడంతో చివరికి రాజును అభ్యర్థిగా బలపర్చారు.

అయితే గ్రామంలో ప్రచారం చేయ డానికి కొందరు నాయకులు సహకరించకపోవడంతో రాజు ఆందోళనకు గురయ్యాడు. రాజు అయ్యప్ప మాలధారణ వేసుకున్నందు న ప్రతిరోజు అయ్యప్ప స్వాములతో కలిసి ఉం డేవాడు. గత కొన్ని రోజులుగా రాజు భోజనం సరిగా చేయకుండా తీవ్ర ఆందోళనకు గురవుతుండటంతో కుటుంబీకులు ఆసుపత్రిలో సైతం చూపించారు. ఎన్నికల్లో ఖర్చు కోసం ఉన్న భూమిని సైతం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు.

అయితే రాజుకు రాజకీయంగా కొందరు మద్దతునివ్వ క పోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. ఈ క్రమంలోనే శంశోద్ధిన్పూర్ గ్రా మ శివారులో అయ్యప్ప స్వాములంతా సన్నిధానం ఏర్పాటు చేసుకోగా అక్కడికి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున సన్నిధానం ప్రాంతం సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు.