27 August, 2026 | 2:42 AM

గల్లంతైన బాలయ్య ఆచూకీకి చర్యలు చేపట్టాలి

27-08-2026 12:31 AM
  1. బాధిత కుటుంబానికి చంద్రశేఖర్ ప్రసాద్- పరామర్శ 
  2. రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేత 

శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (విజయక్రాం తి): హఫీజ్పేట్ డివిజన్లోని ప్రేమ్నగర్కు చెంది న బాలయ్య (60) జూలై 28న కురిసిన భారీ వర్షాల్లో నాలాలో పడి కనుమరుగైన ఘటనపై తెలంగాణ రక్షణ సేన నాయకుడు వాసి లి చంద్రశేఖర్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సహాయక చ ర్యలు సరిపడా వేగంగా లేవని, ఇప్పటికీ ఆ చూకీ దొరకకపోవడం బాధాకరమని ఆయ న అన్నారు.

ప్రజాప్రతినిధులు లేదా ధనవంతులు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇంత మం దకొడి వైఖరి ఉండేదా?అని ప్రశ్నించిన వా సిలి, పేదలకు వేరు,ధనికులకు వేరు న్యా యం అమలు కావడం సమాజంలో అసమానతకు దారి తీస్తుందని స్పష్టం చేశారు.అనంతరం బాలయ్య సతీమణి పద్మను సందర్శించి ఓదార్చారు.ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు బాలయ్య పిల్లలకు మున్సిపల్ శాఖలో వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, పద్మకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి, 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని వాసిలి డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని వాసిలి అధికారులకు విజ్ఞప్తి చేశారు.పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినా మానవతా దృష్టితో రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని బాలయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు లావణ్య, సందీప్, దయానంద్, మురుగేసన్, విష్ణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.