10 June, 2026 | 1:06 AM

ఉద్యోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పని చేస్తా

10-06-2026 12:00 AM

జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి

జలమండలి ఎన్నికల్లో విజయం సాధించిన 

మొగుళ్ల రాజిరెడ్డికి జలమండలి అధికారుల సత్కారం

ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత  అంకితభావంతో పని చేస్తానని తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. జల మండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మొగుళ్ళు రాజిరెడ్డి మంగళవారం జల మండలి మేనేజంగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. 

అలాగే జేఎండి  మయాంక్ ని, ఇతర ఉన్నతాధికారులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా మొగుళ్ళ రాజిరెడ్డి తో పాటు పలువురిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.  అనంతరం మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ విజయానికి కారణమైన ఉద్యోగులు, కార్మిక సోదరులను స్వయంగా కలిసి వారి అమూల్యమైన ఓటు, అపారమైన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం ఒక్క వ్యక్తిదే కాదని, జల మండలి ఉద్యోగులు, కార్మికుల ఐక్యతకు, నమ్మకానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకని అన్నారు. మీ అందరి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.