15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

న్యాయవాదుల సంక్షేమానికి ఐఏఎల్ కృషి

18-12-2025 12:28 AM

కోదాడ డిసెంబర్ 17: న్యాయవాదుల సంక్షేమానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లయర్స్ కృషి చేస్తుందని ఆ సంఘ కేంద్ర కమిటీ సభ్యుడు ఓరుగంటి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల నరసింహారావులు తెలిపారు. బుధవారం కోదాడ పట్టణం కోర్టు ఆవరణలో ఐఏఎల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.

ప్రస్తుతం న్యాయవాదులకు అందుతున్న నగదు రహిత వైద్య సేవలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచి కుటుంబ సభ్యులందరికీ వర్తింపజేయాలని, మరణించిన న్యాయవాది కుటుంబానికి ప్రభుత్వం అందించే 10 లక్షల రూపాయల సహాయాన్ని 20 లక్షల రూపాయలకు పెంచడంతోపాటు సీనియర్ న్యాయవాదులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.