18-12-2025 12:27:41 AM
చిట్యాల, డిసెంబర్ 17 : లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో చిట్యాల వాసి మాస్టర్స్ పూర్తి చేసి పట్టాను బుధవారం స్వీకరించాడు. చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల గ్రామానికి చెందిన జనగాం కళ్యాణ్ గౌడ్ (కిట్టు) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ).
నుండి అంతర్జాతీయ సామజిక మరియు ప్రజా విధానాల పై మాస్టర్స్ ను డిస్టింక్షన్ లో పూర్తి చేసి లండన్ మాస్టర్స్ పట్టాను స్వీకరించాడు. వార్షికోత్సవంలో కళ్యాణ్ తల్లిదం డ్రులు జనగాం రవీందర్‌గౌడ్ - మంగ హాజరవగా వారి సమక్షంలో మాస్టర్స్ పట్టాను స్వీకరించగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు గ్రామస్తులు కళ్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు.