ఏయూలో ఐబీఎం అడ్వాన్స్‌డ్ ఐటీ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
ఘట్ కేసర్, మార్చి 11 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఐసీటీ అకాడమీ సహకారంతో సైబర్ సెక్యూరిటీపై సర్టిఫికేట్ కోర్సు పేరుతోఐటి స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 12 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిటి అకాడమీ రాష్ట్ర అధిపతి గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఉందని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని డిజిటల్ భద్రతకు తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ జి. విష్ణుమూర్తి కూడా విద్యార్థులకు సందేశం అందిస్తూ, ఈ తరహా కార్యక్రమాల్లో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని తమ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి డా. డి. రమణ కుమార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సర్టిఫికేట్ కోర్సులో సైబర్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలు, సైబర్ ముప్పులను గుర్తించడం, డిజిటల్ సిస్టమ్స్ భద్రత, సురక్షిత కంప్యూటింగ్ విధానాలు వంటి అంశాలపై శిక్షణ అందిస్తు న్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 12న ముగియనుందని, కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయబడతాయి.




