10-12-2024 11:56:15 PM
దుబాయ్: అబుదాబి టీ10 లీగ్ ఫ్రాంచైజీ మాజీ అసిస్టెంట్ కోచ్ సన్నీ దిల్లాన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నించినట్లు తేలడంతో సన్నీ దిల్లాన్‌పై ఆరేళ్ల పాటు నిషేధం విధించినట్లు ఐసీసీ మంగళవారం స్పష్టం చేసింది.
‘ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఫిక్సింగ్‌కు యత్నించడం, ఆర్టికల్ 2.4.4 ప్రకారం ఫిక్సింగ్‌కు పాల్పడే వ్యక్తులకు సమాచారం అందించడం నేరంగా పరిగణిస్తూ ఐసీసీ నిమయావళి ఉల్లఘించి నందుకు గానూ సన్నీ దిల్లాన్‌పై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’ అని ఐసీసీ పేర్కొంది. కాగా గతేడాది సెప్టెంబర్ 13 నుంచే సన్నీపై ఈ నిషేధం వర్తించనుందని తెలిపింది.