09-11-2025 02:26:37 PM
మహమ్మదాబాద్: ప్రభుత్వం ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించేందుకు రైతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే ఎమ్ నారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో ఐకెపి వడ్ల సెంటర్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వము రైతులకు మద్దతు ధర కల్పించడం జరుగుతుందని తెలిపారు.
వరి కళ్ళలకు వస్తుంది అని తెలిసిన వెంటనే ముందస్తుగా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యాన్ని పరిశుభ్రంగా తీసుకువచ్చేందుకు రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ. మండల వ్యవసాయ అధికారి నరేందర్, ఎపీఎం నిర్మల. మాజీ ఎంపీపీ శాంతి రంగ్య. మోహన్ నాయక్,కొత్త నారాయణ,కొత్త జయమ్మ,కే ఎల్లయ్య, శేఖర్ రెడ్డి, మహిళా సంఘాలు, రైతులు పాల్గొన్నారు.