09-11-2025 02:22:54 PM
ముకరంపురా,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముస్లిం దూదేకుల రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా హసీన మమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు అజీముద్దీన్ నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో పలు సేవలను అందించారు. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు పాటుపడ్డారు. పార్టీలో తనదైన శైలిలో సమర్ధత కట్టుబాటు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం నేపథ్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమించారు.
ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ... తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ముస్లిం (దూదేకుల) మహిళ అధ్యక్షురాలుగా నియమించిన రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో తమ దూదెకుల ఉనికిని విస్తరించడంపై బలోపేతం చేస్తూ ప్రత్యేక దృష్టి పెడతానని మహిళా నాయకులకు సాధికారత కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి తోడ్పడుతానన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పథకాలను తమ సంఘ మహిళలకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన ముస్లిం పెద్దలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా అహర్నిశలు కృషి చేస్తానన్నారు.